Vijay Antony | ‘బిచ్చగాడు’ (Bichagadu) సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). సంగీత దర్శకుడిగా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం నటుడిగా మారారు. ఇక ఈ నటుడు ప్రస్తుతం ‘తుఫాను’ (Thufan) అంటూ ప్రేక్షకుల రానున్నాడు. విజయ్ మిల్టన్ (Vijay Milton) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శరత్‌కుమార్, సత్యరాజ్, మేఘా ఆకాష్, ధనంజయ, శరణ్య పొన్వన్నన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను వదిలింది. అయితే ఈ టీజర్ ఈవెంట్లో విజయ్ ఆంటోని చెప్పులు లేకుండా రావడం అందరిని షాక్‌కు గురిచేసింది.
ఇక ఇదే విషయంపై విజయ్ అంటోనిని మీడియా అడుగగా విజయ్ స్పందిస్తూ.. నేను గత మూడు నెలల నుంచి చెప్పులు లేకుండా నడుస్తున్నాను. ఇలానే షూటింగ్ వెళుతున్నాను. అయితే ఇలా చూసిన చాలామంది నన్ను ఏదైనా దీక్ష చేస్తున్నారా అని అడుగుతున్నారు. అలాంటిదేం లేదు. ఒకరోజు చెప్పులు లేకుండా నడిచాను. చాలా ప్రశాంతగా అనిపించింది. నాకు నచ్చింది కూడా. చెప్పులు లేకుంగా నడవడం ఆరోగ్యానికి కూడా మంచింది. అందుకు లైఫ్‌లాంగ్ చెప్పులు వేసుకోకూడదని నిర్ణయించుకున్నా అంటూ విజయ్ తెలిపాడు.
#Toofan pic.twitter.com/m9En1DVcAk
— Bhashyasree Writer (@Bhashyasree) May 30, 2024