IB71 Movie On Ott | ఆరేళ్ల కిందట వచ్చిన ‘ది ఘాజీ ఎటాక్’ సినిమాతో అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. తొలి సినిమాకే నేషనల్ అవార్డు గెలుచుకుని తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుణ్ తేజ్‌తో అంతరిక్షం సినిమా తీశాడు. కమర్షియల్‌గా ఈ సినిమా సేఫ్ కాలేదు కానీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకుని IB71 సినిమా తెరకెక్కించాడు. విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించిన ఈ సినిమా మే 12న విడుదలై మంచి రివ్యూలను తెచ్చుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్ ఏయిర్‌ఫోర్స్ అధికారి పాత్ర పోషించాడు. కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ దక్కించుకుంది. కాగా జూలై 7 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. హిందీతో పాటు తెలుగు ఆడియోను అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. యాభై ఏళ్ల పాటు అత్యంత రహస్యంగా ఉంచిన ఇండియాస్ టాప్ సీక్రెట్ మిషన్ ‘IB71’ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. 30 మంది ఏజెంట్లు 10 రోజుల పాటు చేపట్టిన అత్యంత రహస్య మిషన్ గురించి, శత్రువుల నుంచి దేశాన్ని కాపాడటానికి IB ఏజెంట్ దేవ్ జమ్వాల్ (విద్యుత్ జమ్వాల్) ఎలాంటి సాహసాలు చేశాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.