Vidya Vasula Aham Trailer | కోట బొమ్మాళి పీఎస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు యువ నటులు శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ప్రేమ లేకపోయినా జంటగా ఆకట్టుకుంది. అయితే వీళ్లిద్దరు మళ్లీ కలిసి నటిస్తున్నారు. శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘విద్యా వాసుల అహం’ (Vidya Vasula Aham). తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో మే 17న నేరుగా విడుదల కానున్న ఈ చిత్రానికి మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ప్రస్తుత జనరేషన్లో పెళ్లైన జంటల మధ్య క్యూట్ రిలేషన్ షిప్‌తో పాటు అహం (ఇగో) వలన గొడవలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కాన్సెప్ట్‌తోనే ‘విద్యా వాసుల అహం’ తెరకెక్కింది. కొత్తగా పెళ్లయిన ఈ జంట తమ ఇగోని వదిలి కలిసి ఉంటారా.. అహంతో విడిపోతారా అనేది ఈ సినిమా స్టోరీ. ఫుల్ ఎంటర్టైనర్గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కల్యాని మాలిక్ సంగీతం అందిస్తున్నాడు.