Vidya Balan | లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ విద్యా బాలన్. ఆమె నటించిన ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’, ‘శకుంతలా దేవి’, ‘షేర్ని’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. నటనకు అవకాశమున్న విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ తనకుంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది విద్యా బాలన్.
అయితే విద్యా బాలన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన సినిమాల అప్డేట్లతో పాటు తనకు సంబంధించిన ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. అయితే కొందరు ఆకతాయిలు విద్యా బాలన్ పేరుతో ఒక ఫేక్ ఇన్‌స్టా అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఈ అకౌంట్‌తో విద్యా స్నేహితులకు, కుటుంబసభ్యులకు, అభిమానులకు మెసేజ్‌లు పంపుతున్నారు. దీంతో ఇది నిజంగా విద్యా బాలన్ ఖాతానే అనుకుంటూ అభిమానులు కూడా మేసేజ్‌లు పెడుతున్నారు. తాజాగా ఈ విషయం విద్యా వరకు వెళ్లగా.. ఈ ఫేక్ అకౌంట్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
నా పేరుతో ఇన్‌స్టాలో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ అయ్యింది. అది నాది కాదు. నేను, నా టీమ్ ఆ అకౌంట్‌పై రిపోర్ట్ చేశాం. మీరంతా కూడా ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయండి అంటూ విద్యా రాసుకోచ్చారు. ఇక గత ఏడాది ఓటీటీలో ‘జల్సా’ అనే చిత్రంలో కనిపించిన విద్యా బాలన్…ప్రస్తుతం ‘నీయత్’ అనే చిత్రంతో పాటు కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ‘భూల్ భులైయా 3’లో నటిస్తున్నది.