తమిళ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన ‘విడుతలై-1’ చిత్రం ఇటీవలే తమిళనాడులో ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. పీరియాడిక్ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాను గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 15న విడుదలకానుంది ఈ సందర్భంగా శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. విచారణ పేరుతో మహిళలను హింసకు గురిచేస్తున్న పోలీసులపై పెరుమాళ్ మాస్టర్ (విజయ్ సేతుపతి) పోరాటం..అతని కోసం పోలీసుల వేట నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తిని పంచింది. దర్శకుడు వెట్రిమారన్ రియలిస్టిక్ టేకింగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో భవానీ శంకర్, ప్రకాష్‌రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించారు. ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.