Vidudala Movie Telugu Version | తమిళ దర్శకుడు వెట్రిమారన్ కమెడియన్ సూరిని హీరోగా పెట్టి తెరకెక్కించిన మూవీ విడుదల. రెండు నెలల క్రితం తమిళంలో రిలీజైన ఈ సినిమా అక్కడ కోట్లు కొల్లగొట్టింది. ఇక నెల రోజుల తర్వాత అల్లు అరవింద్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేశాడు. అయితే తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. నిజానికి డిస్ట్రిబ్యూటర్లకు కొంత మేర నష్టాలే తెచ్చిపెట్టింది. ఇక ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అది కూడా డైరెక్టర్కట్ వెర్షన్. కాగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కేవలం తమిళ భాషలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
కాగా తాజాగా తెలుగులో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఇక తొలిపార్టుకు విపరీతమైన రెస్పాన్స్ రాగా.. రెండో పార్ట్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. పోలీసులకు సమస్యగా మారిన విజయ్ సేతుపతిను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు గిరిజనులను హింసిస్తుంటారు. అప్పుడు పెరుమాళ్ పోలీసులను ఎలా అడ్డుకుంటాడు? పెరుమాళ్‌ను పట్టుకునేందుకు సూరి తన పై అధికారులకు ఎలాంటి సహాయం చేశాడు అనే నేపథ్యంలో తెరకెక్కింది. అయితే సినిమాలో హింసాకాండని చూసి తట్టుకోవడం చాలా కష్టం. మహిళలను కొట్టడం వంటివి మానసికంగా డిస్టర్బ్ చేస్తాయి. గిరిజన మహిళలపై పోలీస్‌లు చేసిన టార్చర్‌ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు.