రోహిత్ నందా, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘విధి’. శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రంజిత్ నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తెలుగు రాష్ర్టాల్లో పది లక్షల మంది కంటి చూపులేని వాళ్లున్నారు. అందులో చాలా మంది థియేటర్‌కు వెళ్లి ఉండకపోవచ్చు.
వారంతా థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను ఆస్వాదించవొచ్చు’ అన్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాత తెలిపారు. ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే కథాంశమిదని, హీరోయిన్ ఆనంది తెలిపింది. ఇప్పటివరకు తాను మ్యూజిక్ అందించిన చిత్రాల్లో ఇది పూర్తి భిన్నమైదనది సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అన్నారు.