Kajol Devgan | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)పై ఓ మార్ఫింగ్ (Deep Fake video) వీడియోను క్రియేట్ చేసి ఆకతాయిలు ఇబ్బందిపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే మరో స్టార్ నటిని ఆకతాయిలు టార్గెట్ చేశారు. బాలీవుడ్ నటి కాజోల్ (Kajol Devgan)పై ఓ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ అయ్యింది. కాజోల్ ఫేస్‌ను వాడుకుని ఫేక్ వీడియో సృష్టించారు ఆకతాయిలు. ఇందులో కాజోల్ మార్ఫింగ్ ముఖంతో ఉన్న ఆమె దుస్తులు మార్చుకున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా దీనిపై నెటిజన్లు, కాజోల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని.. దీనిని నమ్మొద్దంటూ పోస్టులు పెడుతున్నారు.
రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాదు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్ మొదలుకుని, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.