VidaaMuyarchi | తమిళ అగ్ర నటుడు అజిత్ నటిస్తున్న తాజా చిత్రం విదాముయార్చి (VidaaMuyarchi). ఏకే 62గా వస్తోన్న ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష కథనాయికగా నటిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్ అజర్బైజాన్ దేశంలో జరుపుకుంది.
ఇక ఈ షూటింగ్‌కు సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ షూటింగ్లో భాగంగా అజిత్ డూప్ లేకుండా రిస్కీ స్టంట్ చేయగా.. కారు నడుపుతూ.. అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో అజిత్‌కు ఏమి కాలేదని మేకర్స్ వెల్లడించారు. ఇది జరిగి 5 నెలలు అయితుందని లేటెస్ట్ వీడియో కాదని వెల్లడించారు. అయితే అజిత్ డూప్ లేకుండా ఇలా చేయడం కొత్తేమి కాదు ఇంతకుముందు మంకత్తా(తెలుగులో గ్యాంబ్లర్) సినిమా కోసం కూడా అజిత్ డూప్ లేకుండా బైక్ రైడింగ్ చేశాడు.
#VidaaMuyarchi Risky Stunt by #AK
BTS.. November 2023.. In Azerbaijan 🇦🇿 pic.twitter.com/kZpVDpdblf
— Ramesh Bala (@rameshlaus) April 4, 2024