Rashmika Mandanna | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ఛావా. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. వాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతుంది. అయితే ఈ సినిమా మొదటి రోజే ఓ అరుదైన రికార్డును సృష్టించింది. ఈ సినిమా తొలి రోజు రూ.31 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ఛావా రికార్డులకెక్కింది.
మరోవైపు ఈ సినిమా ప్రీ సేల్ బుకింగ్స్‌లో కూడా అదరగొట్టింది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 5 లక్షల టికెట్స్ అమ్ముడైనట్లు మూవీ టీమ్ తాజాగా పేర్కొంది. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది.
‘CHHAAVA’ IS VICKY KAUSHAL’S FIRST *DOUBLE-DIGIT* OPENER + *BIGGEST OPENER* EVER…#VickyKaushal versus #VickyKaushal… *Day 1* biz…
⭐️ [2025] #Chhaava: ₹ 33.10 cr
⭐️ [2024] #BadNewz: ₹ 8.62 cr
⭐️ [2019] #Uri: ₹ 8.20 cr
⭐️ [2018] #Raazi: ₹ 7.53 cr
⭐️ [2023] #SamBahadur:… pic.twitter.com/gCKQ15PHcT— taran adarsh (@taran_adarsh) February 15, 2025