Manoj Kumar | ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దేశ భక్తి చిత్రాలకి ఆయన బాగా ఫేమస్. ఆయన మృతిపై పలువురు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. అలానే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
1999లో నటనకి దూరం అయ్యారు మనోజ్ కుమార్. ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. జాతీయ చలన చిత్ర అవార్డ్ గ్రహీత అయిన మనోజ్ కుమార్ 1992లో పద్మశ్రీ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. భారతీయ సినిమా మరియు కళలకు ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 2015లో సినిమా రంగంలో అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. జూలై 24, 1937న ఆయన జన్మించారు. మనోజ్ కుమార్..మనోజ్ కుమార్ “షాహీద్” (1965), “ఉప్కార్” (1967), “పురబ్ ఔర్ పశ్చిమ్” (1970), మరియు “రోటీ కప్డా ఔర్ మకాన్” (1974) వంటి దేశభక్తి చిత్రాలని తెరకెక్కించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. నటుడిగా కొన్ని వందల సినిమాలలో నటించారు.
మనోజ్ కుమార్ని భరత్ కుమార్ అని కూడా పిలుస్తుంటారు. “ఉప్కార్” చిత్రంలో అతను పోషించిన పాత్రకి గాను ఆయనని అందరు భరత్ కుమార్ అని కూడా పిలుస్తుంటారు. “హరియాలీ ఔర్ రాస్తా”, “వో కౌన్ థీ”, “హిమాలయా కి గాడ్ మే”, “దో బదన్”, “పత్తర్ కే సనమ్”, “నీల్ కమల్”, మరియు “క్రాంతి” వంటి ఫేమస్ చిత్రాలలో నటించడమే కాక దర్శకత్వం కూడా వహించాడు.