Dheeraj Kumar | హిందీ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, ప్రముఖ టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 11:40 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ధీరజ్ కుమార్ మరణం బాలీవుడ్‌తో పాటు టెలివిజన్ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతిపట్ల అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 1965లో సినీ రంగ ప్రవేశం చేసిన ధీరజ్ ఎన్నో హిందీ, పంజాబీ చిత్రాలలో నటించారు. ‘క్రియేటివ్ ఐ’ ప్రొడక్షన్ హౌస్‌ని స్థాపించి ‘ఓం నమః శివాయ’తో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక టీవీ సీరియల్స్‌ను నిర్మించారు.