Venu Swamy| సెలబ్రిటీ జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి ఎప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తలలో నిలుస్తుంటాడు. నాగ చైతన్య, సమంత వీడిపోతారని జాతకం చెప్పగా అలానే వారు విడిపోయారు. ఇక అప్పటి నుండి మరింత రెచ్చిపోతూ కామెంట్స్ చేసేవాడు. ఇక నాగ చైతన్య, శోభిత గురించి వేణు స్వామి దారుణంగా కామెంట్స్ చేయడంతో అతడిపై ఫిలిం జర్నలిస్టులు కంప్లైంట్ చేయడంతో కాస్త వెనక్కి తగ్గాడు. ఎప్పుడు ఎవరి జాతకాలు చెప్పనంటూ ఓ వీడియో కూడా విడుదల చేశాడు. కాని ఇప్పుడు వేణు స్వామి ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు సెలబ్రిటీలు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఓ జర్నలిస్టుతో ఆయన మాట్లాడిన ఆడియో అంటూ ఓ న్యూస్ ఛానల్ దీన్ని ప్రసారం చేసింది.
ఇందులో వేణు స్వామి మాట్లాడుతూ..నేను ఇండస్ట్రీలో ముగ్గురు చనిపోతారని చెప్పాను కదా,ఒకరు అయితే సూసైడ్ చేసుకుంటాడు. ఒక హీరోయిన్, ఒక హీరో చనిపోతారు అని అన్నారు. శాస్త్రం ప్రకారం సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవడం ఖాయమంటూ వేణు స్వామి చెప్పడంతో ఫ్యాన్స్ గుండె బద్ధలైంది. ఇంక లెక్క ప్రకారమైతే విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటారంటూ ఆడియోలో మాట్లాడారు వేణు స్వామి. ఒక హీరోకి సీరియస్ ఇంజ్యురి ఉంటుందని చెప్పడంతో, నిజంగా అంత ప్రాబ్లెమ్ ఉందా అని జర్నలిస్ట్ అడిగారు. దానికి వేణు స్వామి మాట్లాడుతూ.. అతడికి మొత్తం సమస్యలే.
ఇక్కడి నుండి అక్కడి దాకా అన్నీ సమస్యలే అని వేణు స్వామి అన్నాడు. ఆయన ఎవ్వరికీ చెప్పడం లేదని, అందుకే రాజాసాబ్ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే ప్రభాస్కా అంటే ఇవన్నీ ముందు జరగబోతున్నాయని, అన్నీ అయిన తర్వాత మాట్లాడుకుందామంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీవీ ఛానెల్లో లీకైన ఈ వీడియోపై ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు స్పందిస్తూ.. ఇలాంటి విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వింటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలకు హీరోలు అంతగా స్పందించరు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ వింటే మాత్రం చాలా బాధపడతారు అని ప్రభు అన్నారు. అయితే ఇంత నీచమైన కామెంట్స్
చేస్తున్న వేణుస్వామిపై గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.