వెన్నెల కిషోర్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నెపూస రమణారెడ్డి నిర్మాత. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘శకుంతలక్కయ్యా..’ అనే పార్టీసాంగ్ను విడుదల చేశారు. సునీల్‌కశ్యప్ మ్యూజిక్ అందించిన ఈ పాట హుషారైన బీట్స్‌తో సాగింది.
కాసర్ల శ్యామ్ సాహిత్యాన్నందించిన ఈ పాటను ఊహా నేహా ఆలపించారు. స్నేహ గుప్తా డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో శ్రీకాకుళం డిటెక్టివ్ షెర్లాక్హోమ్స్గా వెన్నెల కిషోర్ కనిపిస్తాడని, ఓ కేసును ఛేదించే క్రమంలో ఆయనకు ఎదురైన సంఘటనలేమిటన్నదే కథాంశమని, చక్కటి హాస్యంతో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా తదితరులు చిత్ర తారాగణం.