వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్‌కామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి గూడూరు నిర్మించారు. త్వరలో విడుదల కానుంది. ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘హైదరాబాద్‌కు చెందిన ఓ మధ్యతరగతి ఇల్లాలు అరుంధతి నేపథ్యంలో నడిచే కథ ఇది. దానినుంచి ఆమె ఎలా బయటపడింది? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. కామెడీ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది’ అన్నారు. కథలో థ్రిల్లింగ్ అంశాలతో పాటు కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.