Chaari 111 Movie | హిలేరియస్‌గా వెన్నెల కిషోర్ ‘చారి 111’ ట్రైలర్
Chaari 111 Movie | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చారి 111’ (Chaari 111). తమిళ ముద్దుగుమ్మ సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటిస్తుండగా.. టీజీ కీర్తికుమార్ (TG keerthy Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 01న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chaari 111 Movie | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చారి 111’ (Chaari 111). తమిళ ముద్దుగుమ్మ సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటిస్తుండగా.. టీజీ కీర్తికుమార్ (TG keerthy Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ టీజర్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
1992లో ఇండియా – పాకిస్థాన్ కలిసి ఒక జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇకపై రెండు దేశాల్లో ఎలాంటి అణ్వాయుధాలు గానీ బయోలాజికల్ ఆయుధాలు కానీ తయారు చేయగూడదు అనే సంభాషణతో ట్రైలర్ మొదలవుతుంది. ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. టెర్రరిజంకు చెందిన ఒక సీక్రెట్ గ్రూప్ కోవర్ట్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనీ చూస్తుంది. ఒకవేళ అది స్టార్ట్ అయితే దేశానికి ప్రమాదం. ఇక ఇది కనిపేట్టే సీక్రెట్ స్పైగా ఏజెంట్‌గా వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. ఇక సీనియర్ నటుడు మురళి శర్మ ఈ సినిమాలో స్పై ఏజెన్సీ హెడ్‌గా కనిపించనున్నారు. ట్రైలర్ మొత్తం ఫన్ ఎంటర్టైనర్గా సాగింది. ఈ సినిమాను బర్కత్ స్టూడియెస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

