అగ్ర కథానాయకులు వెంకటేష్-కల్యాణ్‌రామ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్, కృతిశెట్టి కథానాయికలు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, సురేష్‌బాబు కెమెరా స్విఛాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
దర్శకుడు అనిల్ రావిపూడి శైలిలో ఆద్యంతం హాస్యభరితంగా సాగే చిత్రమిదని, సంక్రాంతి బరిలో వినోదాల పండగలా ప్రేక్షకుల్ని అలరిస్తుందని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన, నిర్మాత: సాహు గారపాటి, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.