గురువారం 21 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 15:34:33

జ‌ల్లిక‌ట్టు ఆస్కార్‌కు ఎంపిక కావ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన వెంకీ

జ‌ల్లిక‌ట్టు ఆస్కార్‌కు ఎంపిక కావ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన వెంకీ

మ‌న‌కు ఆస్కార్ అవార్డ్ అంద‌ని ద్రాక్ష‌గానే మారింది.  దేశానికి సంబంధించిన చాలా  సినిమాలు  ఆస్కార్ వ‌ర‌కు వెళ్ల‌డం, చివ‌ర‌లో ఎంపిక కాక‌పోవ‌డం కొన్ని సంవ‌త్స‌రాలుగా జ‌రుగుతూ వ‌స్తుంది. అయితే ఈ సారి 93వ ఆస్కార్‌ పురస్కారాల్లో ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో మన దేశం నుంచి జ‌ల్లిక‌ట్టు  చిత్రం ఎంపిక కాగా, ఈ చిత్ర‌మైన ఆస్కార్‌ను గెలుచుకుంటుందా అని అభిమానులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. 

ఆస్కార్‌ నామినేషన్‌ కోసం హిందీ, మలయాళం, మరాఠీతో పాటు ఇతర భాషల నుంచి 27 సినిమాలు  పరిశీలనకు రాగా వాటిలో నుంచి ‘జల్లికట్టు’ను ఎంపికచేసినట్లు ఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ చైర్మన్‌  రాహుల్‌ రవైల్‌ పేర్కొన్నారు. మనుషుల్లోని పశుప్రవృత్తిని వాస్తవిక కోణంలో ఆవిష్కరించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ చిత్రం నామినేట్ కావ‌డంపై హీరో వెంక‌టేష్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో అద్భుత టాలెంట్ ఉంద‌ని, అక్క‌డి నుండి మంచి క‌థ‌లు వ‌స్తాయ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. జ‌ల్లిక‌ట్టు ఆస్కార్ ఎంపిక కావ‌డంపై చాలా సంతోషంగా ఉన్నాను. చిత్ర బృందానికి నా శుభాకాంక్ష‌లు అని వెంకీ పేర్కొన్నారు


logo