Venky Movie Re release | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నాడు హీరో మాస్‌రాజా రవితేజ. టాలీవుడ్లో ఈయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే రవితేజ నటించిన సినిమాలలో ‘వెంకీ’ ఎంత పెద్ద క్లాసిక్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2004లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ యూత్‌ను ఆకట్టుకుని నెట్టింట మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ బ్లాక్ బస్టర్ సినిమాను డిసెంబర్ 30న రీ-రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ రీ-రిలీజ్ సందర్భంగా మూవీ షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేశాడు.
”నా వెంకీ సినిమా రీ-రిలీజ్ అవ్వడం చాలా చాలా హ్యాపిగా ఉంది. ఎందుకంటే వెంకీ నాకు చాలా ఇష్టమైన సినిమా. వెంకీ సినిమా ఎప్పుడు గుర్తొచ్చినా నాకు నవ్వొస్తుంటుంది. దాని షూటింగ్ మొత్తం కూడా మేము సరదాగానే చేశాం. ఈ సినిమా అంతా బాగా, రియలిస్టిక్‌గా రావడానికి ముఖ్య కారణం రవితేజ. తాను నా మీద ఉంచిన నమ్మకమే వలనే ఆ సినిమా అలా తీయగలిగాను. మూవీ వచ్చి ఇన్ని ఇయర్స్ అయిన దానికి ఉన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా షాకింగ్‌గా ఉంది. ఈ సినిమాను ప్రేక్షకుల ఎంత ఓన్ చేసుకున్నారంటే నిజంగా వారికి రుణపడి ఉంటాను అంటూ” శ్రీను వైట్ల చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సామజిక వేదికల్లో వైరల్ అవుతుంది.
“Venky” is very close to me!!
The challenges faced by youth, their emotions, and response to situations remain almost same across different timelines. The realistic presentation of those aspects made the film ever-green!!
The way @RaviTeja_offl portrayed his character and… pic.twitter.com/QlUtzXWPVD— Sreenu Vaitla (@SreenuVaitla) December 29, 2023