వెంకటేష్, రానాలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనే అభిమానుల చిరకాల కల నిజంకానున్నది. ఈ బాబాయ్ అబ్బాయ్ కలిసి ‘రానా నాయుడు’ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నారు. అమెరికన్ పాపులర్ డ్రామా ‘రే డొనోవన్’ ఆధారంగా ఈ సిరీస్తెరకెక్కుతోంది. కరన్ అన్షుమాన్ దర్శకుడు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలకానున్న ఈ సిరీస్‌ను లోకోమోటివ్ గ్లోబల్ సంస్థ నిర్మిస్తున్నది. బుధవారం ఈ సిరీస్ ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. ఇందులో తెల్లజుట్టుతో కళ్లద్దాలు ధరించి కొత్త లుక్‌లో వెంకటేష్ కనిపిస్తుండగా, రానా ైస్టెలిష్‌గా దర్శనమిచ్చారు. రానానాయుడు అనే వ్యక్తి కథతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. బాలీవుడ్ ప్రముఖులకు వచ్చే సమస్యలను అతడు ఎలా పరిష్కరిస్తాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. వెంకటేష్ మాట్లాడుతూ ‘రానాతో కలిసి పనిచేసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మంచి ప్రాజెక్ట్ కుదిరింది’ అని తెలిపారు. ‘మా కెరీర్లో భిన్నమైన ప్రయత్నమిది. చాలెంజింగ్‌గా భావించి చేస్తున్నాం’ అని రానా చెప్పారు. తెలుగు నేటివిటీకి తగినట్లుగా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నామని సుందర్ అరోన్ చెప్పారు.