Daggubati Venkatesh | టాలీవుడ్ సీనియర్ నటుడు దగ్గుబాటి వెంకటేష్ రెండో కుమార్తె హవ్యవాహిని (Havyavahini) వివాహం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్ (Nishanth)తో కలిసి హవ్యవాహిని ఏడడుగులు వేసింది. రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వివాహ వేడుక జరుగగా.. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతేడాది అక్టోబర్‌లో హవ్యవాహిని నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నాగ చైతన్య, దగ్గుబాటి రానా, సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. వెంకటేష్‌కు నలుగురు సంతానం. అందులో ముగ్గురు అమ్మాయిలు. చివరిగా కుమారుడు అర్జున్ జన్మించాడు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల క్రితం 2019లో జరిగింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటూ ఇన్ఫినిటీ ప్లాటర్ (Infinity Platter) అనే ఫుడ్‌కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది.
The heartiest couple Nishanth & Havya Vahini seal their love story with a magical wedding @VenkyMama #Nishanth #HavyaVahini pic.twitter.com/PclJCUjqOK
— Vamsi Kaka (@vamsikaka) March 15, 2024