Jigarthanda Double X | కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్ (Raghava Lawrence), ఎస్జే సూర్య (SJ Surya) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda Double X). ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు జిగర్తాండ 2 టీజర్, ట్రైలర్లకు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నవంబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో నిన్న రాత్రి నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చాడు.
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాఘవ లారెన్స్, వెంకటేష్ కలిసి డ్యాన్స్ చేశారు. వెంకటేష్ నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ప్రేమించుకుందాం రా (Preminchukundhamraa) సినిమాలోని ఐకానిక్ సాంగ్ పెల్లికళ వచ్చేసిందే బాలా.. పల్లకిని తెచ్చేసిందే బాలా.. హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా.. అంటూ సాగే పాటకు ఇద్దరు కలిసి స్టెప్పులు వేశారు. ఇక ఈ పాటకు కొరియోగ్రాఫర్‌గా చేసిన లారెన్స్ డ్యాన్స్ వేస్తూ.. వెంకటేష్‌ని కూడా పిలువగా వెంకీ కూడా లారెన్స్‌తో కలిసి తన సిగ్నేచర్ స్టెప్ వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
An evergreen step for the iconic song ❤️
Victory Venkatesh @VenkyMama Garu and @offl_Lawrence shake a leg at the #JigarthandaDoubleX grand pre-release event 🤩🤩
Watch live now!
– https://t.co/UEYmVMY4PDWorldwide release on November 10th.@iam_SJSuryah @karthiksubbaraj… pic.twitter.com/sEsz72m6yV
— BA Raju’s Team (@baraju_SuperHit) November 4, 2023