రూటు మార్చుకుంటున్న వెంకటేశ్.. అలాంటి సినిమాలకే ఓకే
విక్టరీ వెంకటేశ్ నుంచి రొటీన్ కమర్షియల్ సినిమా చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఆయన వయసుకు తగ్గట్లుగా కథలు ఎంచుకుంటున్నాడు.

ఎఫ్ 2 మినహాయిస్తే విక్టరీ వెంకటేశ్ నుంచి రొటీన్ కమర్షియల్ సినిమా చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఆయన వయసుకు తగ్గట్లుగా కథలు ఎంచుకుంటున్నాడు. మిగిలిన హీరోలు ఇంకా హీరోయిన్లతో డ్యూయెట్లు పాడుతుంటే.. వెంకటేశ్ మాత్రం పెళ్ళీడు వచ్చిన పిల్లలకు తండ్రిగా నటిస్తున్నాడు. దృశ్యం సినిమాలో తొలిసారి అలాంటి పాత్ర చేశాడు వెంకీ. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత గురులో కూడా వయసుకు తగ్గ పాత్రలోనే కనిపించాడు. ఇక ఈ మధ్య విడుదలైన నారప్ప సినిమాలో కూడా ముగ్గురు పిల్లల తండ్రిగా నటించాడు. ఇప్పుడు చేస్తున్న దృశ్యం 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే కాదు.. ఇకపై చేయబోయే సినిమాల విషయంలో కూడా వెంకటేశ్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
మరీ ముఖ్యంగా కథల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా కనిపించడం లేదు.. అలసత్వం అసలే ప్రదర్శించడం లేదు. తన వయసుకు తగ్గ పాత్రలు వస్తే ఎలాంటి కథల్లో అయినా ఇమిడి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు వెంకటేశ్. ఇదే విషయాన్ని తన దగ్గరికి కథలు తీసుకొస్తున్న దర్శకులకు కూడా చెబుతున్నాడు వెంకీ. ఇప్పుడున్న సమయంలో హీరోయిన్లతో పాటలు పాడి డాన్సులు చేస్తే బాగోదని.. తన వయసుకు తగిన పాత్రలు తీసుకొస్తే చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని యంగ్ దర్శకులకు కూడా వెంకటేశ్ చెబుతున్నాడు. త్వరలోనే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నటించబోయే సినిమాలో లెక్చరర్‌గా వెంకీ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
వయసు 60 ఏళ్లు దాటడంతో హుందాగా ఉండే పాత్రల్లో మాత్రమే నటించాలని వెంకీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ హీరోయిన్లతో రొమాన్స్ చేసి.. అవసరమైనప్పుడు ఫైట్లు చేసే కథలు ఆయన దగ్గరికి వస్తున్నాయి. కానీ వాటికి వీలైనంత దూరంగా ఉంటున్నాడు వెంకటేశ్. ఇకపై చేయబోయే సినిమాలు కూడా కచ్చితంగా ఇలాగే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్.. మరోవైపు కామన్ ఆడియన్స్.. ఇద్దర్ని దృష్టిలో పెట్టుకొని తన వయసును బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు చేయబోతున్నాడు ఈ సీనియర్ హీరో. అందుకే ఈ సమయంలో కూడా వరుస విజయాలు అనుకుంటున్నాడు వెంకటేశ్. మిగిలిన సీనియర్ హీరోలు కూడా ఇలా వయసుకు తగ్గ పాత్రలు చేస్తే బాగుంటుంది అంటున్నారు విశ్లేషకులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రజినీకాంత్ చిన్నపిల్లోడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నితిన్ హీరోయిన్
సెప్టెంబర్‌లో సినిమాల జాతర..క్యూలైన్ లో ఉన్న సినిమాలివే..!
వైరల్‌గా మారిన యషికా హాస్పిటల్ పిక్.. !
ఈ శుక్రవారం థియేటర్స్‌లో సందడి చేయనున్న సినిమాలేంటో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

