Veeranjaneyulu Vihara Yatra | వీకే నరేష్, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్ పలుట్ల దర్శకుడు. బాపినీడు.బి, సుధీర్ ఈదర్ నిర్మాతలు. ఈ నెల 14 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కాబోతున్నది. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వీకే నరేష్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అద్భుతమైన కామెడీ, పంచ్ డైలాగ్లు ఉంటాయి.
ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’ తరహాలో పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. చక్కటి వినోదంతో పాటు మనసును కదిలించే భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ సినిమా చూస్తే అందరికీ కుటుంబ అనుబంధాలు గుర్తుకొస్తాయని రాగ్ మయూర్ చెప్పారు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథాంశమిదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.హెచ్.విక్రమ్.