Veera Simha Reddy | గతేడాది అఖండ సినిమాతో గర్జించిన నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సారి వీరసింహారెడ్డి (Veera Simha Reddy)గా రాయలసీమ పౌరుషాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పటివరకు రిలీజైన గ్లింప్స్ వీడియోలు, సాంగ్స్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది.
స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ పూర్తయినట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ మేకింగ్స్ స్టిల్స్ కొన్ని నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
తన అభిమానులకు కావాల్సిన వినోదాన్ని ఫుల్ మీల్స్ లా అందించేందుకు రెడీ అవుతున్నట్టు ఇప్పటివరకు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రషెస్ చెబుతున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలువబోతున్నట్టు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో
తెలిసిపోతుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు.
వీరసింహారెడ్డి నుంచి విడుదలైన జై బాలయ్య మాస్ ఆంథెమ్, సుగుణ సుందరి, మా బావ మనోబావాలు పాటలు మ్యూజిక్ లవర్స్ కు కావాల్సిన పక్కా ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
వీరసింహారెడ్డి మేకింగ్ స్టిల్స్..
Making Stills from #VeeraSimhaReddy with the GOD OF MASSES 🔥
Here are the #FramesOfVeeraSimhaReddy 💥
Mass Jaathara in Theatres from JAN 12 💥
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/blb7QgpBYc
— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2022
వీరసింహారెడ్డి టీజర్..
జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్..
సుగుణ సుందరి లిరికల్ వీడియో సాంగ్..
మా బావ మనోభావాలు సాంగ్ ప్రోమో..