నటి వేదిక నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’. హరిత గోగినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏఆర్ అభి నిర్మాత. అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్ర పోషించారు. విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 60కి పైగా అవార్డులను ఈ సినిమా గెలుచుకున్నదని మేకర్స్ తెలిపారు. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా సోషల్ మీడియా ద్వారా శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
ఒక చీకటి గదిలో ఓ మూల ముడుచుకొని కూర్చొని, భయంగా చూస్తున్న వేదిక స్టిల్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ త్వరలోనే ఉంటుందని మేకర్స్ తెలిపారు. జయప్రకాశ్, పవిత్రలోకేష్, అనీష్ కురువిల్ల, షాయాజీ షిండే, సత్యకృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్. సహ నిర్మాత: సుజాత రెడ్డి, నిర్మాణం: దత్తాత్రేయ మీడియా.