VarunLav | టాలీవుడ్లో కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న స్టార్ కపుల్ ఎవరంటే.. ఠక్కున చెప్పే పేర్లు వరుణ్‌తేజ్ (Varun Tej)-లావణ్యత్రిపాఠి (Lavanya Tripathi). ఈ సెలబ్రిటీలిద్దరూ ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ కొత్త జంట తొలిసారి దీపావళి సంబురాల్లో పాల్గొంది. అత్తామామ, మరదలు నిహారికతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది లావణ్యత్రిపాఠి. అత్తవారింటిలో లావణ్య త్రిపాఠి జరుపుకున్న మొదటి దీపావళికి సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
లావణ్యత్రిపాఠి తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. వరుణ్‌తేజ్ -లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలీలోని టుస్కనీలో వివాహబంధంతో ఓ ఇంటివారయ్యారు. ఇటలీలో జరిగిన పెళ్లి వేడుకలో సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు. ఇటలీలో పెండ్లికి హాజరుకాలేకపోయిన వారి కోసం మెగా ఫ్యామిలీ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ ఫొటోలు కూడా ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine). వార్ డ్రామా నేపథ్యంలో VT13గా వస్తోన్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్గా నటిస్తోంది. యదార్థ సంఘటనల స్పూర్తితో తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని తెరకెక్కిస్తున్నారు.
మరోవైపు పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కా (Matka)లో కూడా నటిస్తున్నాడు వరుణ్ తేజ్. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రాబోతుంది. లావణ్య త్రిపాఠి తమిళంలో నటిస్తోన్న Thanal విడుదలకు రెడీ అవుతోంది.