వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకుంటూ నటుడిగా ఎదుగుతున్నారు వరుణ్‌తేజ్. కంచె, గద్దలకొండ గణేష్, తొలిప్రేమ. ఎఫ్ 1, ఎఫ్ 2.. ఇలా పొంతన లేని పాత్రలతో భిన్నమైన ఇమేజ్ను సాధించారాయన. ప్రస్తుతం వరుణ్ చేస్తున్న సినిమా ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడిక్ డ్రామా ఇది. గాంబ్లింగ్ గేమ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా కరుణకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కూడా వరుణ్‌ది వైరైటీ కేరక్టరే. ఇదిలావుంటే.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమాకు పచ్చజెండా ఊపారు వరుణ్‌తేజ్. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నది. ఈ సినిమాకు ‘కనకరాజు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. దాదాపు ఇదే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్‌లో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఈ సినిమాలో కమెడియన్ సత్య పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం.