Matka| టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కా (Matka). ఈ మూవీ కోసం ఇప్పటికే మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నాడు వరుణ్ తేజ్. తాజా అప్డేట్ ప్రకారం అక్టోబర్ 4న హైదరాబాద్‌లో మట్కా షూటింగ్ షురూ కానుంది. 20 రోజులపాటు ఫస్ట్ షెడ్యూల్ కొనసాగనుండగా.. దీనిపై టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందట. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్లో భాగంగా కెన్యాకు వెళ్లాడు. ఈ మూవలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.
మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రాబోతుంది. కథానుగుణంగా ఈ మూవీలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో నోరాఫతేహి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
వరుణ్ తేజ్ మరోవైపు వార్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine)లో కూడా నటిస్తున్నాడు. VT13గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ తేజ్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇందులో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు డెడికేట్ చేస్తూ నిర్మిస్తున్నారు.తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని తెరకెక్కిస్తున్నారు.
మట్కా టైటిల్ టీజర్..