వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణకుమార్ దర్శకుడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యథార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. విజయ్ మాస్టర్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఈ పోరాట ఘట్టాల్లో హీరో వరుణ్‌తేజ్ రిస్కీ స్టంట్స్ పర్ఫార్మ్ చేస్తున్నాడని, ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్.