Matka Movie | మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మట్కా (Matka). పలాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంఛ్ అనంతరం మీడియాతో మచ్చటించింది చిత్రబృందం.
ఈ క్రమంలోనే స్టార్డమ్ ఉన్నప్పుడు నెగిటివ్ పాత్రలు చేయడం అవసరం అనిపిస్తుందా.? అంటూ ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానమిస్తూ.. సినిమా అనేది పెద్ద రిస్క్. నా లాస్ట్ సినిమా రిస్క్ అయితే ఈ సినిమా కూడా రిస్కే. కథలో పాత్రకు ఏది అవసరం అయితే అది చేయల్సిందే. జనాలు కూడా ఇప్పుడు కొత్తగా కోరుకుంటున్నారు. హీరో అంటే రాముడి లాంటి పాత్రలే చేయాలని రూల్ లేదు. ఆ రూల్స్ అన్ని మనం పెట్టుకున్నవే. ఈ సినిమా గురించి అయితే. వాసు ప్రయాణం గురించి ఈ చిత్రం. వాడు సినిమాలో ఏం చేస్తున్నాడు అదే చేయమని కాదు. ఇది జస్ట్ మూడు గంటల ఎంటర్టైనమెంట్ మాత్రమే. వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి అంటూ వరుణ్ తేజ్ చెప్పుకోచ్చాడు.