Gandeevadhari Arjuna | టాలీవుడ్ హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా సినిమా గాండీవధారి అర్జున. VT 12 ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. మేకర్స్ త్వరలో బుడాపెస్ట్‌లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ పార్టు కోసం వరుణ్ ప్రిపరేషన్ ప్లాన్ షురూ చేశాడు.
వరుణ్‌తేజ్ యాక్షన్ కొరియోగ్రఫీ టీం నేతృత్వంలో శిక్షణలో పాల్గొంటున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ సినిమా కథానుగుణంగా యూరప్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లోని లొకేషన్లలో షూట్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ది ఘోస్ట్ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గాండీవధారి అర్జున చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గతేడాది బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన గని చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వరుణ్ తేజ్. ఈ చిత్రం ఊహించని విధంగా ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. వరుణ్‌తేజ్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన ఎఫ్ 3 బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
ప్రాక్టీస్ సెషన్లో వరుణ్‌తేజ్ ఇలా..
Sweating it out to set the screens ablaze 🔥
Mega Prince @IAmVarunTej is prepping for a high-octane action sequence of #GandeevadhariArjuna, that is to be shot in Budapest soon💥💥@sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial @jungleemusicSTH pic.twitter.com/SE4J9uUw0R
— SVCC (@SVCCofficial) May 3, 2023