Matka | వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకుడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంటున్నది. నలభై రోజుల పాటు జరిగే ఈ తాజా షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను నిర్మించారు. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను చిత్రీకరించనున్నారు. ‘దేశం మొత్తం సంచలనం సృష్టించిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కుతున్నది.
డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో నడిచే ఈ కథలో హీరో వరుణ్‌తేజ్ నాలుగు విభిన్న అవతారాల్లో కనిపిస్తారు. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా అన్ని భాషల వారికి కనెక్ట్ అవుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్‌చంద్ర, అజయ్‌ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఏ.కిషోర్ కుమార్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్.