వరుణ్‌సందేశ్ హీరోగా నటిస్తున్న ‘ది కానిస్టేబుల్’ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. వరుణ్‌సందేశ్ మాట్లాడుతూ ‘ఇందులో కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తా. ఈ తరహా పాత్రను గతంలో చేయలేదు’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 5వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ప్రస్తుతం మిగతా నటీనటుల ఎంపిక జరుగుతున్నది’ అని పేర్కొన్నారు. దువ్వాసి మోహన్, సూర్య, కల్పలత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హజరత్ షేక్, సంగీతం: సుభాష్ ఆనంద్, మాటలు:శ్రీనివాస్ తేజ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్కే.