‘ప్రేక్షకుల ఈలలు, చప్పట్లే నాకు స్ఫూర్తినిస్తాయి. గత రెండేళ్లుగా ఆ సందడిని మిస్ అవుతున్నా. హైదరాబాద్‌లో మీ అందరి హంగామా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది’ అన్నారు శివకార్తికేయన్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వరుణ్ డాక్టర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడు. కోటపాడి జె రాజేష్ నిర్మాత. నేడు విడుదలకానుంది. ఇటీవల ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శివకార్తికేయన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర చిత్రణ వినూత్నంగా ఉంటూ ఆకట్టుకుంటుంది. సినిమా కథకు ఎల్లలు లేవు. కంటెంట్ బాగుంటే ఏ భాషలోనైనా ఆదరిస్తారు’ అని చెప్పారు. సినిమాలో వినోదంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెలిపారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. తన కెరీర్‌తో ఎంతో ప్రత్యేకమైన చిత్రమిదని, న్యూఏజ్ సినిమాగా ఆకట్టుకుంటుందని కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఏషియన్ సునీల్, ఠాగూర్ మధు తదితరులు పాల్గొన్నారు.