Varun Dhawan | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కృతి సనన్ రిలేషన్ షిప్‌పై బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
కృతిసనన్, వరుణ్ ధావన్ నటించిన తాజా చిత్రం ‘భేడియా’ (తెలుగులో ‘తోడేలు’) ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్ర ప్రొమోషన్స్లో భాగంగా వీరిద్దరూ ఓ షోలో పాల్గొన్నారు. షో యాంకర్ కరణ్ జోహార్.. ‘నీ డేటింగ్ లిస్ట్‌లో కృతి సనన్ నేమ్ ఉందా..?’ అని వరుణ్ ధావన్‌ను ప్రశ్నించగా ‘లేదు..’ అని సమాధానమిచ్చాడు. ‘ఆ లిస్ట్‌లో కృతి సనన్ పేరు లేదు. ఎందుకంటే తన పేరు మరొకరి గుండెల్లో ఉంది. ప్రస్తుతం అతను ముంబయిలో లేడు. దీపికా పదుకొణెతో షూటింగ్ నేపథ్యంలో వేరే ప్రాంతంలో ఉన్నాడు’ అంటూ సమాధానమిచ్చారు.
ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమా ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాను వైజయంతి మూవీస్‌పై అశ్వినీ దత్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో వస్తుందని టాక్. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్లో దీపిక, ప్రభాష్ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ ధావన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Whaaaaaaattt 😯😁🥰💖…… Joo meyy soch raha hoo, voo aap log bii?!😌😹🤔🤔. #KritiSanon #Prabhas𓃵 !! #ProjectK 🪐 pic.twitter.com/F3s91EyFwe
— Jai Kiran💕Adipurush🏹 (@Kiran2Jai) November 27, 2022