Varsha bollamma | సౌత్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి వర్ష బొల్లమ్మ. సతురన్ అనే తమిళ సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ భామ ఆ తర్వాత కళ్యాణం అనే చిత్రంతో మలయాళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2020లో చూసి చూడంగానే సినిమాతో వర్ష తెలుగులోకి అడుగుపెట్టింది. మూడు భాషలలో ఈ భామ మంచి యాక్టర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. దర్శకుడు అట్లీ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా 2019లో విడుదలైన ‘బిగిల్’ సినిమాలో వర్ష బొల్లమ్మ ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. ఈ పాత్రతో వర్ష అందరి దృష్టిని ఆకర్షించింది.
‘జాను’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘పుష్పక విమానం’, ‘స్వాతిముత్యం’, ‘ఊరి పేరు భైరవకొన’ లాంటి చిత్రాల్లో మెరిసి తన నటనతో ఆకట్టుకుంది వర్ష. ఈ అమ్మడు తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా తన సోషల్ మీడియాలో పొట్టి బట్టలు వేసుకొని డిఫరెంట్ స్టిల్స్ ఇస్తూ ఫొటోలు దిగింది. అయితే కురచ దుస్తులలో గోమాత ముందు ఫొటో దిగే సరికి కొన్ని హిందూ సంఘాలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంప్రదాయ దుస్తులతో గోమాత ముందు ఫొటోలు దిగాలి కాని ఇలా కురచ దుస్తులు వేసుకొని కాదు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కర్ణాటక బ్యూటీ చిక్కుల్లో పడ్డట్టు అయింది.
మరోవైపు వర్ష బొల్లమ్మ కురచ దుస్తులతో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ..అదిదా సర్ప్రైజ్.. ప్యాంట్ ఎక్కడా అటూ స్టుపిడ్ కామెంట్స్ చేయోద్దు. పంత్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఉన్నాడు అంటూ కాస్త తెలివిగా స్పందించింది. తనని ఎలాగు ప్యాంట్ మరిచిపోయా అని అడుగుతారు కాబట్టి ముందుగానే తన వర్షెన్‌లో తెలివిగా రాసుకొచ్చింది. వర్ష ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా తన అప్డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో వర్షకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ కంటే డిఫరెంట్ స్టైల్ లో తనని తాను రిప్రజెంట్ చేసుకుంటూ వెరైటీ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ పిక్స్ ఫ్యాన్స్ కి వినోదాన్ని అందిస్తూ ఉంటాయి.