Varsha Bollamma | మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం, ఊరు పేరు భైరవకోన సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది బెంగళూరు భామ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). ప్రస్తుతం తమిళం, ఇంగ్లీష్ బైలింగ్యువల్ ప్రాజెక్ట్ చేస్తున్న ఈ భామ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం కానిస్టేబుల్ కనకం (Constable Kanakam). ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈటీవీ ఒరిజినల్స్ ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీ షూటింగ్ నేడు ప్రారంభమైంది. లైట్స్.. కెమెరా.. యాక్షన్.. కానిస్టేబుల్ కనకం ప్రయాణం అధికారికంగా మొదలైంది.. సినిమా లాంచింగ్ ఫొటోలను షేర్ చేశారు మేకర్స్. ఈ మూవీలో రాజీవ్‌కనకాల మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
Lights, Camera, Action! 🚔
The journey of #ConstableKanakam has officially begun! 🌟
Coming soon on #ETVWin, starring the incredible #VarshaBollamma. ❤️💫@VarshaBollamma @RajeevCo
🎬 #PrasanthKumarDimmala
🎥 #SriramMukkupati
🎶 @sureshbobbili9
💵 #KovelamudiSatyaSaibaba &… pic.twitter.com/434op1GCrp— BA Raju’s Team (@baraju_SuperHit) December 2, 2024
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట
Harish Shankar | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. షోలే డైరెక్టర్‌తో హరీష్ శంకర్