అల్లు అర్జున్- సుకమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. రీసెంట్గా చిత్రంలోని ట్రైలర్‌ను విడుదుల చేశారు. టెక్నికల్ ఇష్యూల వల్ల కాస్త లేట్‌గా విడుదలైన ట్రైలర్ అభిమానులకి పూనకాలు తెప్పించింది. ఇందులో బన్నీ ..పుష్పరాజ్ పాత్రలో ఒదిగిపోయాడు.
పుష్ప ట్రైలర్‌పై సెలబ్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ మాత్రమే సూపర్ స్టార్. ఇలాంటి రియలిస్టిక్ పాత్రలో నటించడానికి భయపడలేదు. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజినీకాంత్ లాంటి వారు ఇలాంటి పాత్రలు చేయగలరా.. “పుష్ప అంటే ప్లవర్ కాదు.. ఫైర్” అని ట్రైలర్లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌ను రాసుకొచ్చాడు వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ట్రైలర్లో పుష్ప.. పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదేలే అని బన్నీ చెప్పిన తీరుకు అందరు ఫిదా అవుతున్నారు. ఈ ప్రపంచం నీకు గన్ను ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవరి యుద్దం వారిదే అంటూ బన్నీ చెప్పిన ఇంటెన్స్ డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక శ్రీవల్లి పుష్ప మధ్య మంచి రొమాంటిక్ ట్రాక్ ఉందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. సినిమా అభిమానులకి మంచి వినోదం ఇస్తుందని అంటున్నారు.