Varanasi to the World | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ (SSMB29) నుంచి ఒక భారీ అప్డేట్ వెలువడింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘వారణాసి టు ది వరల్డ్’ (Varanasi to the World) అనే పేరుతో తాజాగా ఐమాక్స్ (IMAX) ఫార్మాట్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ను పూర్తిస్థాయిలో ఐమాక్స్ ఫార్మాట్ కోసం ప్రత్యేకంగా చిత్రీకరించారు. 1.43 యాస్పెక్ట్ రేషియోతో (Aspect Ratio) విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకలకి సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలలో తీర్చిదిద్దుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఈ సినిమా కథ ఆధ్యాత్మిక నగరం వారణాసిలో ప్రారంభమై, ప్రపంచంలోని వివిధ దేశాల మీదుగా సాగే గ్లోబల్ అడ్వెంచర్‌గా ఉండబోతోంది. ‘గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్’ జోనర్లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక సాహసోపేతమైన ప్రయాణికుడిగా కనిపించనున్నారు.