VaraLaxmi SarathKumar | తమిళ సినీ ప్రముఖ నటి, నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ భాషలలో నటిస్తుంది. శింబు సరసన బోడ బోడి చిత్రంలో నటించడం ద్వారా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న వరలక్ష్మీ ఇటీవల తన ఖాతాలో పలు హిట్స్ వేసుకుంది. గతేడాది హనుమాన్, రాయన్, మ్యాక్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ చిన్నది ఈ ఏడాది ప్రారంభంలోనే మదగజరాజాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం విజయ్ దళపతి జన నాయగన్ మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక సినిమాలతో పాటు పలు టీవీ షోలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది. అయితే తాజాగా ఓ తమిళ టీవీ షోకి హాజరైన వరలక్ష్మీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టీవీ షోలో భాగంగా ఒక లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో ఎదురైన వేధింపుల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకోగా, వెంటనే వరలక్ష్మీ కూడా చిన్నతనంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. తాను కూడా చిన్నతనంలో లైంగిక వేధింపుల బారిన పడ్డాను. నీది నాది ఒకటే కథ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె చేసిన కామెంట్స్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
స్టార్ నటుడి కూతురైన వరలక్ష్మి లైంగిక వేధింపుల బారిన పడడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఇక అద్భుతమైన నటనా కౌశలంతో పేరు తెచ్చుకున్న వరలక్ష్మి విలన్ పాత్రలతో ఎంతగానో అలరించింది.కొన్ని రోజుల క్రితం, ముంబైకి చెందిన నికోలయ్‌తో వివాహం జరిగింది. నటి వరలక్ష్మి చిరకాల ప్రియుడు నికోలయ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త . ప్రస్తుతం ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటున్నారు.