నటిగా ఆ గుర్తింపు చాలు!
సినిమాల విషయంలో భాష గురించి అస్సలు ఆలోచించనని, మంచి పాత్ర దొరికితే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమని చెప్పింది వరలక్ష్మి శరత్‌కుమార్. గత కొన్నేళ్లుగా తెలుగులో మంచి విజయాలతో దూసుకుపోతున్న ఆమె తాజాగా ‘హను-మాన్' చిత్రంలో కీలక పాత్రను పోషించింది.
సినిమాల విషయంలో భాష గురించి అస్సలు ఆలోచించనని, మంచి పాత్ర దొరికితే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమని చెప్పింది వరలక్ష్మి శరత్‌కుమార్. గత కొన్నేళ్లుగా తెలుగులో మంచి విజయాలతో దూసుకుపోతున్న ఆమె తాజాగా ‘హను-మాన్’ చిత్రంలో కీలక పాత్రను పోషించింది. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
‘హను-మాన్’ సూపర్‌హీరో కథాంశం. ఇందులో నేను తేజ సజ్జా అక్క.. అంజమ్మ పాత్రలో కనిపిస్తాను. అక్క, తమ్ముడు మధ్య ఉండే అనుబంధం, వారి మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. క్రాక్, వీరసింహా రెడ్డి, కోట బొమ్మాళి చిత్రాల్లో నేను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించాను. ‘హను-మాన్’లో నా క్యారెక్టర్ పూర్తి పాజిటివ్‌గా ఉంటుంది.
పాత్రల పేర్లతో పిలుస్తున్నారు
సినిమా పేరు చెబితే అందులో నా పాత్ర గుర్తుకు రావాలి. అదే నాకు ముఖ్యం. హీరోయిన్, సైడ్ క్యారెర్టక్లాంటి తేడాలను పట్టించుకోను. కథలో నా పాత్ర ప్రాధాన్యత గురించే ఆలోచిస్తాను. ప్రేక్షకులు నన్ను జయమ్మ, భానుమతి అంటూ నేను పోషించిన పాత్రల పేర్లతో పిలుస్తున్నారు. నటిగా ఆ గుర్తింపు చాలు. హిందీలో మంచి రోల్ దొరికితే తప్పకుండా నటిస్తాను. రెండున్నరేళ్లుగా హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యాను. ప్రస్తుతం తెలుగు, తమిళంలో కొన్ని ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పాను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

