వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కైంప్లెంట్’. సంజీవ్ మేగోటి దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాత. బుధవారం టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక హారర్ థ్రిల్లర్. ప్రేమ, పగ..మంచి, చెడు మధ్య సంఘర్షణ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది.
వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. ఆమె క్యారెక్టర్ భయంతో పాటు చక్కటి వినోదాన్ని అందిస్తుంది’ అన్నారు. తన పాత్రలో యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు కావాల్సినంత వినోదం ఉంటుందని కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పింది. 45 రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేశామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీమ్ మేగోటి, సుధాకర్ మారియో, రచన-దర్శకత్వం: సంజీవ్ మేగోటి.