అనినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న చిత్రం ‘వానర’. సిమ్రాన్ చౌదరి కథానాయిక. మైథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, సోషియో ఫాంటసీ కథాంశంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. నందు, పృథ్వీ, కోన వెంకట్, సత్య, శివాజీరాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌రెడ్డి, దర్శకత్వం: అవినాశ్ తిరువీధుల.