అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న మైథలాజికల్ రూరల్ డ్రామా ‘వానర’. సిమ్రాన్ చౌదరి కథానాయిక. నందు ప్రతినాయకుడిగా నటించారు. అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌రెడ్డి నిర్మాతలు. జనవరి 1న సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని ఈ ప్రకటనలో వారు పేర్కొన్నారు. ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, చమ్మక్‌చంద్ర, రచ్చరవి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనం: విశ్వజిత్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: వివేక్ సాగర్, సమర్పణ: శంతను పత్తి, నిర్మాణం: సిల్వర్ స్క్రీన్ సినిమాస్.