ValmikiRamayana | భారతీయ ఇతిహాసం(Mythology) రామాయణాన్ని వెండితెరపై మరోసారి ఆవిష్కరించేందుకు సిద్ధమవుతుంది జాతీయ అవార్డు గ్రహీత, దర్శకురాలు భావనా తల్వార్ (Bhavna Talwar). ఆమె దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘వాల్మీకి రామాయణం’. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. భక్తి మరియు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో శ్రీరాముడి పాదాలను చూపించడం విశేషం. “పర్వతాలు ఉన్నంత కాలం, నదులు ప్రవహించినంత కాలం రామాయణం జీవించే ఉంటుంది” అనే శక్తివంతమైన క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
చాలా ఏండ్ల తర్వాత భావనా తల్వార్ మెగాఫోన్ పట్టి ఈ సినిమా తెరకెక్కిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తుండగా.. బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ అందిస్తున్నాడు. ఆనంద్ నీలకంఠన్ మరియు చంద్రప్రకాష్ ద్వివేది కథను అందిస్తున్నారు. మరోవైపు ఈ భారీ పౌరాణిక చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘VALMIKI RAMAYANA’ ANNOUNCED – 2 OCT 2026 RELEASE… On the auspicious occasion of #RamNavami, director #BhavnaDattaTalwar announces #ValmikiRamayana, a theatrical retelling of the timeless epic.
The film brings together an exceptional creative team:
⭐️ Cinematographer Binod… pic.twitter.com/giZTYeZxOT— taran adarsh (@taran_adarsh) March 26, 2026