వైష్ణవ్‌తేజ్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గిరీశాయ (తమిళ ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ చక్కటి ఫ్యామిలీ కథ ఇదని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: అవినాష్ కొల్ల, సమర్పణ: బాపినీడు, దర్శకత్వం: గిరీశాయ.