అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న చిత్రం ‘వానర’. సిమ్రాన్ చౌదరి కథానాయిక. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బుధవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో అవినాశ్ బైక్‌పై వెళ్తుండగా, ఆయనకు రక్షణగా హనుమంతుడు వెంట వెళ్తున్న స్టిల్ ఆకట్టుకునేలా ఉంది.
త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. నందు, పృథ్వీ, కోన వెంకట్, సత్య, శివాజీరాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌రెడ్డి, దర్శకత్వం: అవినాశ్ తిరువీధుల.