Ustad bhagat singh | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో తాను కమిటైన సినిమాలు కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు తాను అంగీకరించిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా అన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన పవన్, ఇక ‘ఓజి’ని కూడా వీలైనంత త్వరగా ముగించే పనిలో ఉన్నాడు. వెంట వెంటనే డేట్స్ కేటాయించి తన సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం రూపొందనుంది.
గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత వారిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం పవన్ సెట్లో అడుగు పెట్టబోతున్నారన్న వార్త బయటకు రావడంతో ఎప్పుడు ఈ చిత్రం మొదలు పెడతారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షూటింగ్ జూన్ 12 నుండి ప్రారంభం కానుందని అంటున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్ హాఫ్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి కూడా పవన్ భారీగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడుగా జరుగుతున్నాయట.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. గతంలో తమిళ హిట్ తేరి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుందని వార్తలు రాగా, ఇప్పుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్‌లో సీరియస్ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది.ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఒక సైనికుడి హీరోయిజం, దేశభక్తితో కూడిన కథని రాస్తున్నాడని ఫిలిం నగర్ లో జోరుగా చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ జనసేన ఇమేజ్‌ని, సైనికుడి పాత్రతో మిక్స్ చేసి, డైలాగ్స్‌లో రాజకీయ సెటైర్లు, మాస్ ఎలిమెంట్స్‌ని జోడించి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోయేలా హరీష్ శంకర్ కసరత్తులు చేస్తున్నాడట. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.