Double iSmart | టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రామ్ (Ram Pothineni) కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ వస్తుందని తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ఇటీవలే గ్రాండ్‌గా షురూ అయింది. తాజాగా ఫొటో రూపంలో స్టన్నింగ్ అప్డేట్ అందించింది పూరీ జగన్నాథ్ టీం. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ నేడు షురూ అయింది. రామ్‌పై ఉస్తాద్ స్టైల్లో వ్యాన్‌లో వచ్చే సీన్‌ను షూట్ చేసినట్టు తాజా లుక్‌తో తెలుస్తోంది.
పూరీ ఇస్మార్ట్ శంకర్‌ను బీట్ చేసేలా డబుల్ ఇస్మార్ట్ ఇంట్రడక్షన్ సీన్ ప్లాన్ చేశాడా..? ఏంటీ అని తెగ చర్చించుకుంటున్నారు ఈ ఫొటో చూసిన మూవీ లవర్స్, నెటిజన్లు. షాట్ తీసిన తర్వాత పూరీ జగన్నాథ్ డీవోపీ టీంతో చర్చిస్తున్న లుక్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2024 మార్చి 8న విడుదల చేస్తున్నట్టు పూరీ కనెక్ట్స్ బ్యానర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్.. అని ట్వీట్ చేసి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశారు. ఇప్పటికే శక్తిమంతమైన త్రిశూలం.. బ్యాక్ డ్రాప్లో మంటలు కనిపిస్తున్న లుక్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. లైగర్ భారీ డిజాస్టర్ తర్వాత నిరాశలో పడ్డ ఫాలోవర్లు, అభిమానులకు డబుల్ ఇస్మార్ట్‌తో మళ్లీ ఫాంలోకి రావాలని కసిగా చూస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తున్నాడు పూరీ.
ఫస్ట్ పార్టును మించి డబుల్ ఎంటర్టైన్ మెంట్ సినిమాలో ఉండబోతున్నట్టు టైటిల్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు పూరీ. రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. లైగర్ ఫేం విష్ణు రెడ్డి ఈ చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
The much-anticipated shoot of #DoubleISMART began today on a huge set with a MASSive action sequence under action choreography of Kecha & DOP Gianni💥
IN CINEMAS MARCH 8th,2024❤️🔥
Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/ZT66YiHtIF
— Puri Connects (@PuriConnects) July 12, 2023
లాంఛింగ్ ఈవెంట్ ఫొటోలు..
Here are a few more clicks from the #DoubleISMART Launch Ceremony graced by near & dear ones in Hyderabad❤️
Regular Shoot Begins on July 12th 🔥
In cinemas on MARCH 8th, 2024💥Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/oJOA1FoYG4
— Puri Connects (@PuriConnects) July 10, 2023